HNK: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. దామెర మండలంలోని తక్కల్లపహాడ్ గ్రామంలో నేడు నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మొక్కలను నాటారు. మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమని, ప్రతి ఒక్కరూ విధిగా తమ ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అన్నారు.
తెలంగాణ
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: MLA


