MDK: రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ పార్టీలో ప్రిన్సిపాల్ హిమజ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, ప్రతిభ చూపిన సీనియర్లను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రతిభావంతులకు బహుమతులు అందించిన ఈ వేడుకలో సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
తెలంగాణ
'క్రమశిక్షణతో చదివితేనే ఉజ్వల భవిష్యత్తు'


