హైదరాబాద్: 28°C
తెలంగాణ

మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు

​SDPT: హుస్నాబాద్ మున్సిపాలిటీలో క్రైస్తవులకు కో-ఆప్షన్ పదవి కేటాయించడం పట్ల పాస్టర్ల అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ను అసోసియేషన్ ప్రతినిధులు కలసి ధన్యవాదాలు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అధ్యక్షుడు సాల్మన్ పేర్కొన్నారు.