హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా పవిత్రోత్సవాలు

BDK: భద్రాచలం మండలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి పవిత్రదివాసం కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు, పవిత్ర సమర్పణ కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.