హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

KNR: సైదాపూర్ మండలం సర్వాయిపేటలో మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లెబాట కార్యక్రమం నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్వాయి పాపన్న గౌడ్ కోటను పునరుద్ధరించి, రూ.4.5 కోట్లతో టూరిజం ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతామన్నారు. త్వరలో CM తో దీనిని ప్రారంభిస్తామన్నారు. గ్రామంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును సమీక్షించారు.