హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన మహోత్సవంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

NLG: శాలిగౌరారం మండల కేంద్రంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలు హాజరై మొక్కలు నాటారు. పచ్చదనం ప్రగతికి మెట్లు అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి సంరక్షించాలని సూచించారు. చెట్ల పెంపకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని ప్రజలకు వివరించారు.