HYD: తిరుపతి డీఎస్పీనంటూ నమ్మించి పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి ఐదేళ్లుగా పరారీలో ఉన్న అంతర్రాష్ట్ర నిందితుడు కేవీపీ రాజు (40)ను HYD CCS పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు యూనిఫాం, నకిలీ ఐడీతో మోసాలకు పాల్పడ్డాడు. 2021లో HYDకు చెందిన వ్యక్తి నుంచి రూ.1.20 కోట్లు వసూలు చేసి బెంగళూరుకు పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదుతో అప్పట్లో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
నకిలీ డీఎస్పీ అరెస్ట్.. రూ.1.20 కోట్ల మోసం


