హైదరాబాద్: 28°C
తెలంగాణ

హరీష్ రావుపై పొంగులేటి సంచలన ఆరోపణలు..!

KMM: మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి పొంగులేటి సోషల్ మీడియా వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక పాల కంపెనీ ముసుగులో ఆసుపత్రులతో వ్యాపారం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. ఈ అవినీతికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే బయటపడతాయని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.