BHPL: వార్షిక తనిఖీల్లో భాగంగా SP సంకీర్త్ గౌడ్ మంగళవారం చిట్యాల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేశారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్టేషన్‌లోని రికార్డులు, రిసెప్షన్, మెన్ బ్యారక్, టెక్నికల్ రూమ్, పరిసరాలను పరిశీలించారు. అనంతరం SP మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. CI మల్లేష్, SI సతీష్ కుమార్ ఉన్నారు.
తెలంగాణ
VIDEO: చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన SP


