హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు

HYD: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌కు సంబంధించిన కేసులో జూబ్లీహిల్స్ సీఐ ముత్తు యాదవ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో అలసత్వం, విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ముత్తు యాదవ్ మూడు వారాల క్రితమే జూబ్లీహిల్స్ సీఐగా బాధ్యతలు చేపట్టారు.