KMR: సదాశివనగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ శిరీష రవి, పాలకవర్గ సభ్యులు ఆర్టీసీ డిపో మేనేజర్ దినేశ్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మేనేజర్ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేందర్, గ్రామ పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.
తెలంగాణ
'విద్యార్థులకు బస్సు సౌకర్యం కలిపించండి'


