హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతు వేదిక వద్ద విత్తనాల పంపిణీ

VKB: బంట్వారం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వేదిక వద్ద కందులు (PRG-176), మినుములు (VBN-8) విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 4 కిలోల కంది విత్తనాల బ్యాగ్ ధర రూ. 400, మినుముల బ్యాగ్ ధర రూ. 408గా నిర్ణయించారు. మండలంలో మొత్తం 2 క్వింటాళ్ల కందులు, 1 క్వింటా మినుముల స్టాక్ ఉందని, ఆసక్తి గల రైతులు వెంటనే రైతు వేదికను సంప్రదించాలన్నారు.