SRPT: నూతనకల్ మండలం మిర్యాల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ అనంతుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో రోడ్డు పక్కన మొక్కలు నాటారు. పచ్చదనం ప్రగతికి మెట్లు, ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో దరిపలి వీరన్న, వార్డు సభ్యులు ఇరుగు దివ్య, కిరణ్, చలిగంటి మల్లయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
మిర్యాల గ్రామంలో ఘనంగా వన మహోత్సవం


