హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

VKB:​ పరిగి పట్టణంలోని సంకల్ప విద్యాపీఠ్ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వనమహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, నాటిన మొక్కలను సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.