హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొక్కలు నాటిన కలెక్టర్ ప్రతిమా సింగ్

MDK: పర్యావరణ, పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో డీఎఫ్ఓ జోజి, అధ్యాపకులు, విద్యార్థినులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. జిల్లాలో 31.95 లక్షల మొక్కల లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 19.43 లక్షలకు పైగా (60.83%) నాటినట్లు తెలిపారు.