హైదరాబాద్: 28°C
తెలంగాణ

వన మహోత్సవంతో పచ్చదనానికి శ్రీకారం

RR: సంగెం గ్రామంలో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ వేణుగోపాల్ చారి మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.