హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కూల్ క్లైమెట్.. పురి విప్పిన నెమలి

BHNG: భారీ వర్షాలతో పచ్చదనంతో కళకళలాడుతున్న బీబీనగర్ పరిసరాల్లో నెమలి పురివిప్పి నాట్యం చేయడం చూపరులను ఆకట్టుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ప్రకృతి సోయగం మరింత పెరగగా, దానికి నెమలి నాట్యం తోడైంది. అందమైన దృశ్యాన్ని చూసిన స్థానికులు ఆసక్తిగా తిలకించారు. పలువురు తమ సెల్‌ఫోన్లో నెమలి నాట్యాన్ని చిత్రీకరించి మురిసిపోయారు.