హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి: గోవర్ధన్

ADB: బీహార్‌లోని సమస్తీపూర్‌లో నిర్వహించిన ఆలిండియా బీడీ వర్కర్స్ ఫెడరేషన్ 13వ జాతీయ మహాసభల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గోవర్ధన్ జాతీయ వైస్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని గోవర్ధన్ పేర్కొన్నారు. తన ఎన్నికకు సహకరించిన కార్మిక సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.