హైదరాబాద్: 28°C
వార్తలు

పైలట్లకు డోప్ టెస్టులపై కీలక ప్రకటన

పైలట్ల డోప్ టెస్టులపై కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 10 శాతం మంది పైలట్లకు మాత్రమే డోప్ టెస్టులు నిర్వహించే నిబంధన ఉండగా, ఏటా 100 శాతం మంది పైలట్లకు ర్యాండమ్ డోప్ టెస్టులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై DGCA ప్రస్తుతం తీవ్ర కసరత్తు చేస్తోందని ఆయన వెల్లడించారు.