హైదరాబాద్: 28°C
వార్తలు

బాధ్యతగా మొక్కలు పెంచాలి: కొండా సురేఖ

TG: చెట్లు కొట్టేయకుండా రీప్లాంటేషన్ చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. కుటుంబంలో జరిగే వేడుకల సందర్భంగా మొక్కలు నాటాలని సూచించారు. బాధ్యతగా తీసుకుని మొక్కలు పెంచితే పచ్చని తెలంగాణ సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గతేడాది రికార్డు స్థాయిలో వరి పండించామని, ఈసారి ఆ పరిస్థితి లేదన్నారు. వర్షాలు లేనందున రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపారని తెలిపారు.