హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ డాక్టర్ల గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

HYD: నకిలీ వైద్యులపై నగరంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్లలో పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి 11మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నారు. వీరికి వైద్య వృత్తికి సంబంధించిన అర్హతలు ఉన్నాయా? ఎక్కడెక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు? ఎలాంటి వైద్యం అందిస్తున్నారు? అనే అంశాలపై పోలీసులు ఆరా తీశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.