హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడవులను దట్టంగా పెంచాలి: మంత్రి సీతక్క

MLG: అడవులను దట్టంగా పెంచితే వన్యప్రాణులకు ఆహారం, ఆవాసం లభించి అవి జనావాసాల్లోకి రాకుండా నివారించవచ్చని మంత్రి సీతక్క సూచించారు. అధిక ఆక్సిజన్ అందించే మొక్కలతో పాటు కోతులకు ఆహారంగా ఉపయోగపడే పండ్ల మొక్కలను అడవుల్లో విరివిగా పెంచాలని కోరారు. మంత్రి వెంట ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.