ASF: దహేగం మండలం గిరవెల్లి, గెర్రె గ్రామాల మధ్య అధ్వానంగా మారిన రహదారి నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుపై భారీగా బురద పేరుకుపోవడంతో కార్యకర్తలు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రహదారి కోసం వినూత్న పోరాటం


