హైదరాబాద్: 28°C
తెలంగాణ

అటవీ శాఖ ఆధ్వర్యంలో ZPHS ఆవరణలో వనమహోత్సవం

ASF:బెజ్జూర్ మండల కేంద్రంలోని ZPHS ఆవరణలో మంగళవారం వనమహోత్సవం నిర్వహించారు. FRO శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఎంఈవో సునీత మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని FRO సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరోజ, అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.