హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు విద్యార్థులు ఎంపిక

KNR: హనుమకొండలో ఈనెల 26, 27 తేదీల్లో జరగనున్న 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌కు చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. జావెలిన్ త్రో, లాంగ్ జంప్, హై జంప్ తదితర విభాగాల్లో వారు పోటీపడనున్నారు. ఎంపికైన విద్యార్థులను డైరెక్టర్ కర్నల్ రాజా దత్త, ప్రిన్సిపల్ కే. శ్రీనివాస్ అభినందించారు.