WNP: బోనాల పండుగ సందర్భంగా వనపర్తి పట్టణంలోని పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. మహిళలు బోనం కుండలతో తరలివచ్చి క్యూ లైన్‌లలో అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం సమర్పించారు. కోళ్లు, పొట్టేళ్లు బలిచ్చి, కొబ్బరికాయలు కొట్టి పిల్లాపాపలను చల్లగా చూడాలని అమ్మవారిని కోరుకున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
తెలంగాణ
VIDEO: పోటెత్తిన భక్తజనం.. పోచమ్మకు బోనం సమర్పణ


