హైదరాబాద్: 28°C
వార్తలు

భారీ వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలు

హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడుతున్నాయి. భర్మౌర్‌లోని కొడ్లా-ఉరై-ఘటోర్ రోడ్డుపై భారీగా కొండచరియలు విరిగిపడటంతో మార్గం పూర్తిగా దెబ్బతింది. రోడ్డుపైకి మట్టి కొట్టుకురావడంతో అనేక గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. కొండ ప్రాంతాల్లో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.