హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూసీని కాపాడే STPకే నిర్వహణ కరువు

VKB: మూసీ నదిని కాలుష్యం నుంచి కాపాడేందుకు 2012లో వికారాబాద్‌లో ‘శాటిలైట్ టౌన్‌షిప్ పథకం’ కింద రూ.191 కోట్లు కేటాయించారు. ఇందులో డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, రూ.13 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రం (STP) ఏర్పాటు చేశారు. పనులు పూర్తయినా, 25 ఏళ్ల నిర్వహణ ఒప్పందం ఉన్నప్పటికీ కొన్నేళ్లకే ఎస్టీపీ మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది.