హైదరాబాద్: 28°C
తెలంగాణ

KMC కమిషనర్‌తో సుడా ఛైర్మన్ భేటీ

KMM: నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా మరింత సమన్వయంతో ముందుకు సాగుదామని సుడా ఛైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ తెలిపారు. KMCలో కమిషనర్ అభిషేక్ అగస్త్య తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధి, మౌలిక వసతుల బలోపేతం, తదితర పలు అంశాలపై చర్చించారు. అన్ని విభాగాల సమన్వయంతో ఖమ్మం నగరాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు.