హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో 231 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ

మహబూబాబాద్ జిల్లాలోని ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 231 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 101 అంగన్‌వాడీ టీచర్, 130 ఆయా పోస్టులు ఉన్నాయి. అర్హులైన మహిళలు ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 3 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలని అధికారులు సూచించారు.