హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొండగట్టులో పోటెత్తిన భక్తులు

JGL: మల్యాల మండలం ప్రసిద్ధ కొండగట్టు శ్రీ అంజనేయస్వామి ఆలయం మంగళవారం భక్తులతో కిటకిటలాడింది. శ్రావణ మాసం, అంజన్నకు ప్రీతికరమైన మంగళవారం కావడంతో ఉదయం నుంచే ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.