హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాల వార్డెన్, యాజమాన్యంపై కేసు నమోదు

MHBD: తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో ఓ విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించిన పాఠశాల వార్డెన్ మరియు యాజమాన్యంపై విద్యార్థి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదులో పేర్కొన్న ఆధారాల ప్రకారం సమగ్ర విచారణ జరిపి దర్యాప్తు అనంతరం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.