ADB: ఇంద్రవెల్లి మండలంలోని చిలాటిగూడ నుంచి లక్కుగూడకు వెళ్లే మట్టి రహదారి వర్షం పడితే చిత్తడిగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా అధికారులు స్పందించకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంటోందని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించలన్నారు.
తెలంగాణ
అడుగు తీసి అడుగు వేయాలన్న కష్టమే


