WNP: ఆత్మకూరు మండలం పిన్నంచెర్లకు చెందిన 81 మంది బీడీ కార్మికులు పట్టా భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ మాజీ ఎంపీపీపై ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. 1997లో భూమి విక్రయించి బాండ్ పేపర్లు ఇచ్చారని, ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌కు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే అధికారులు జోక్యం చేసుకోవాలన్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు.
తెలంగాణ
పట్టా భూమి రిజిస్ట్రేషన్ కోసం MPDOకు ఫిర్యాదు


