హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా బుకింగ్‌.. ఇబ్బందుల్లో రైతులు

SRPT: ఆత్మకూరు(ఎస్) మండల వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఫర్టిలైజర్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో బుకింగ్ చేసేందుకు గంటల తరబడి ప్రయత్నించాల్సి వస్తోందని రైతులు ఇవాళ ఆరోపించారు. యాప్ పనిచేయకపోవడంతో ఎరువుల కోసం దుకాణాలు, అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు వాపోయారు.