హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ప్రేరణ’ కార్యక్రమానికి విద్యార్థిని ఎంపిక

MLG: ములుగు మండలంలోని బండారుపల్లి పీఎం శ్రీ మోడల్ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని హర్షిత కేంద్ర మానవ వనరుల శాఖ నిర్వహించే ‘ప్రేరణ’ కార్యక్రమానికి ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె వారం రోజులపాటు శిక్షణ పొందనుందని పాఠశాల ప్రిన్సిపల్ సింగారపు దేవకి తెలిపారు. హర్షిత ఎంపికపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.