హైదరాబాద్: 28°C
వార్తలు

దేవాదుల ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్ సమీక్ష

TG: దేవాదుల ఎత్తిపోతల పథకంపై ఇవాళ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమీక్షించనున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం జరగనున్న సమీక్షకు ప్రజాప్రతినిధులు, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు, ఏజెన్సీలు, కాంట్రాక్టర్లు హాజరుకానున్నారు. నీటి లభ్యత అంశాలు, ఆయకట్టు చివరి భూమి వరకు నీరు అందించడం, ప్రాజెక్టులోని అన్ని కాంపోనెంట్లు, ప్యాకేజీల పురోగతి, పరిష్కార మార్గాలపై చర్చించనున్నారు.