హైదరాబాద్: 28°C
వార్తలు

కల్తీ దందా.. 1000 కిలోల రసగుల్లాలు సీజ్

రక్షాబంధన్‌ వేళ ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో భారీ కల్తీ స్వీట్ల దందా వెలుగుచూసింది. బిహారీపురాలోని ఓ గోదాంపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో రసాయనాలు, నాణ్యత లేని పదార్థాలతో తయారుచేసిన 1000 కిలోల రసగుల్లాలను స్వాధీనం చేసుకున్నారు. పండగ రద్దీని ఆసరా చేసుకుని ఇలాంటి కల్తీ వ్యాపారాలకు పాల్పడుతున్న నిర్వాహకుల లైసెన్స్‌ రద్దుకు చర్యలు చేపట్టారు.