హైదరాబాద్: 28°C
వార్తలు

భారత్‌కు టర్నింగ్ పాయింట్ UPI పేమెంట్స్: మోదీ

భారత్‌లో UPI డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది దేశ ఆర్థిక ప్రయాణంలో ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అని కొనియాడారు. ఈ విప్లవాత్మక వ్యవస్థను చూసి ప్రతి భారతీయుడు గర్వపడాలని ఆయన పేర్కొన్నారు. 'యూపీఐ అనుభవం మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపిందో నాకు తెలియజేయండి' అని కోరారు.