హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కరెంట్ షాక్‌తో ఒకరి మృతి

ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం శివరాంపురంలో మంగళవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గోళ్లపాటి ఫిలిప్(44) ఓ ఇంటి వద్ద కరెంట్ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా షాక్ తగిలింది. వెంటనే తాళ్లూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.