SKLM: సారవకోట మండలం కిన్నెరవాడ గ్రామం వంశధార కాలువలో సోమవారం జరిగిన ప్రమాదంలో గల్లంతయిన మెండ విశాల్ మృతదేహం నరసన్నపేట జమ్ము జంక్షన్ వద్ద కాలువలో మంగళవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం వరకు ఫైర్ సిబ్బంది గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ప్రవాహంలో కొట్టుకుపోయి మృతదేహం కనిపించినట్లు స్థానికులు ఇవాళ తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
ఆంధ్రప్రదేశ్
గల్లంతయిన మృతదేహం లభ్యం


