VZM: జిల్లాలో రేగిడి మండలం తునివాడ గ్రామం వద్ద మంగళవారం ఉదయం పాలకొండకు చెందిన తమ్మి నాయుడు స్కూల్ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ బస్సులో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కొందరు గాయపడగా వారిని స్థానికులు వెంటనే రాజాం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలాల్లోకి దూసుకెళ్లిన బస్సు..


