హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాగార్జునసాగర్‌కు తగ్గుతున్న వరద ప్రవాహం

NLG: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వస్తున్న వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 20,838 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 6,810 క్యూసెక్కుల నీటిని అధికారులు ఇవాళ దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 535.40 అడుగులుగా ఉందని నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.