హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పూరీ వెళ్లే రైళ్లలో మార్పులు

విశాఖ: పూరీ రైల్వే స్టేషన్ లో ప్లాట్‌ఫామ్ పనుల కారణంగా విశాఖ మీదుగా వెళ్లే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేశారు. ఈనెల 25 నుంచి అక్టోబర్ 20వ తేదీ మధ్య నడిచే తిరుపతి-పూరీ (17480/17479), గాంధీధామ్- పూరీ (22973/22974) రైళ్లు పూరీకి బదులుగా మాలతీపత్పూర్ వరకే నడుస్తాయి. విశాఖ నుంచి పూరీ వెళ్లే ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు కోరారు.