AP: శ్రీశైలంలో సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవ, దర్శన టికెట్లు ఇవాళ్టి నుంచి ఆన్‌లైన్‌లో ఉంటాయి. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 లేదా https://tms.ap.gov.in/లో బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే 90% టికెట్లు ఉంటాయని, దర్శనానికి గంట ముందు వరకు తీసుకొనే అవకాశం ఉందని ఈవో శ్రీనివాసరావు తెలిపారు. టికెట్ల విషయంలో మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
వార్తలు
ఆన్‌లైన్‌లో శ్రీశైలం ఆర్జిత సేవా టికెట్లు


