HYD: చారిత్రక చార్మినార్ కట్టడాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ సోమవారం సందర్శించారు. పర్యాటకశాఖ, పురావస్తుశాఖ అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. కట్టడం అద్భుత అందాలను వీక్షించిన అనంతరం రాయబారి గోర్.. చార్మినార్ సమీపంలోని నిమ్రా హోటల్లో నిజామియా బిస్కెట్లు, ఇరానీ చాయ్ రుచి చూశారు. వావ్ చార్మినార్.. వావ్ ఇరానీ చాయ్.. అంటూ ఫిదా అయ్యారు.
తెలంగాణ
చార్మినార్ చూసి మురిసిన అమెరికా రాయబారి


