హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దుత్తలూరులో 148 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు'

NLR: దుత్తలూరు మండలంలోని 17 గ్రామ పంచాయతీల పరిధిలో 148 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో మల్లికార్జున తెలిపారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, స్థానాలపై అభ్యంతరాలను ఆగస్టు 24, 25, 26 తేదీల్లో స్వీకరిస్తామని తెలిపారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఆగస్టు 31న తుది పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు.