WGL: కాజీపేట-వరంగల్ రైల్వే స్టేషన్ల మధ్య హంటర్‌రోడ్ శాయంపేట రైల్వేగేట్ సమీపంలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. సుమారు 45 ఏళ్ల వయసున్న వ్యక్తి జీటీ ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే జీఆర్పీ పోలీసులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు, వస్తువులు, టికెట్ లభించలేదని పేర్కొన్నారు.
తెలంగాణ
రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి


