హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కప్పలవాగుకు జలకళ.. రైతుల్లో ఆనందం

NZB: సిరికొండ మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కప్పలవాగు జలకళను సంతరించుకుంది. వాగులో నీటి ప్రవాహం పెరగడంతో తుంపల్లి, కొండాపూర్, గడ్కోల్, రామడుగు, కొండూరు, పెద్దవాల్గోట్, చిన్నవాల్గోట్, పోత్నూర్, సర్పల్లి తండా గ్రామాలకు చెందిన సుమారు 650 ఎకరాల ఖరీఫ్, రబీ పంటలకు సాగునీటి భరోసా లభించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.