శ్రావణమాసంలో ఆచరించాల్సిన వ్రతాలలో ముఖ్యమైనది మంగళగౌరీ వ్రతం. పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్లయిన దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం చేయడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదోతనం కలకాలం నిలుస్తుందని నమ్మకం. ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు నారద పురాణం, బ్రహ్మాండ పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ మాసంలో 4 మంగళవారాలు వచ్చాయి.
భక్తి
శ్రావణమాసం.. నేడు మంగళగౌరీ వ్రతం


